ప్రభుత్వ డిగ్రీ కళాశాల బారువలో 14 నుండి 20 వరకు జరిగే గ్రంథాలయ వారోత్సవాలను ఉద్దేశించి ప్రిన్సిపల్ డా. రామారావు గ్రంథాలయ విలువను వివరించారు. వైస్ ప్రిన్సిపల్ పి. రామకృష్ణ పిల్లల్ని ఉద్దేశిస్తూ భావితరాలకు దిక్సూచి కావాలి అంటే విద్యార్ది దశలోనే గ్రంథాలాయాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమమంలో భాగంగా ఇంచార్జ్ ప్రిన్సిపల్ హేమ సుందర్,, లైబ్రేరియన్ బి.దినేష్ కుమార్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.