రణస్థలం మండలం రావాడ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం లారీ అధిక లోడుతో రావాడ నుంచి రణస్థలం జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో చెరువు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న డ్రైవర్ ను, క్లీనర్ ను బయటకు తీసి కాపాడారు. ఈ ఘటనలో వారి ఇరువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.