ఆముదాలవలస మండలం కట్యాచార్యులపేట గ్రామంలో శుక్రవారం ఉదయం
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు బూత్ నెంబర్ 26 కన్వీనర్ బెండి శ్రీనివాసరావు తెలిపారు. బూత్ నెంబర్ 26 పరిధిలో మొత్తం 109 సామాజిక పెన్షన్లు ఉన్నాయని అన్నారు. వీరికి ప్రభుత్వం ద్వారా మంజూరైన సామాజిక పెన్షన్ ను సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ మెండ మనోహర్ ఆధ్వర్యంలో నగదును లబ్ధిదారులకు అందించామని పేర్కొన్నారు.