పాతపట్నం సమగ్రాభివృద్ధికి సహకరించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. ఈ మేరకు గురువారం ఉదయం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రైతుల పంటలకు నీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందించాలని అన్నారు. రహదారుల నిర్మాణాలకు, మరమ్మతులకు సహకారం అందించాలని వినతిపత్రం అందజేశారు.