జీవితాన్ని నాశనం చేసే మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని పాతపట్నం సీఐ వి. రామారావు అన్నారు. మెలియాపుట్టి మండలం కరజాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మత్తు పదార్థాల వాడకంపై కలిగే నష్టాలను తెలియజేస్తూ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుల పట్ల దృష్టి సారించాలని సూచించారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.