పలాస: ఉద్దానం కిడ్నీ విషాదాలు పుస్తకo ఆవిష్కరణ
ఉద్దానంలో కిడ్నీ వ్యాధి నివారణకు శాశ్వత పరిష్కారం కావాలని ప్రొఫెసర్ కేహెచ్ చలం ఆదివారం పిలుపునిచ్చారు. ఈ మేరకు పలాసలో ఉద్దానం కిడ్నీ విషాదాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ పౌర సమాజమంతా కిడ్నీ వ్యాధి నివారణ కోసం ప్రజా ఉద్యమం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళింగసీమ సాహిత్య సంస్థ అధ్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్, బద్రి కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.