విజయవాడ వరద బాధితులకు తన ఆగష్టు నెల వేతనాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం విరాళంగా ప్రకటించారు. వరద బాధిత ప్రాంతాలు కోలుకోవడానికి ముఖ్యమంత్రి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారని, నావంతు సహకారం అందజేయడం బాధ్యతగా భావిస్తున్నాను పేర్కొన్నారు. మానవత్వ విలువలతో ప్రతి ఒక్కరూ దాతృత్వం చూపించాల్సిన సమయం వచ్చిందని ప్రజలతో అన్నారు.