పలాస నియోజకవర్గంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. మంగళవారం శాసనసభలో ఆమె మాట్లాడుతూ పలాస నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయని త్రాగునీరు కలుషితం కావడంతోనే ఈ ఇబ్బంది వచ్చిందని వివరించారు. దీనిని అధికమించేందుకు సుజల స్రవంతి పథకాన్ని కొనసాగించగలిగితే స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని సభకు తెలియజేశారు.