గ్రామాలలో అభివృద్ధి చేపట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు తెలిపారు. సోమవారం పల్లె పండగ పంచాయితీ వారోత్సవాలలో భాగంగా ఇచ్చాపురం మండలం డొంకూరు, కేసుపురం, కవిటి మండలం నెలవంక పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి చెందితేనే అంతట అభివృద్ధి కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.