ప్రభుత్వ ఆదేశాలు మేరకు గుంతలు లేని రహదారుల నిర్మాణమే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అశోక్ బాబు తెలిపారు. బుధవారం ఇచ్చాపురం మండలం తులసిగాం నుండి బూర్జపాడు గ్రామం వరకు 24 లక్షల రూపాయలతో రహదారుల మరమత్తు పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు ఆ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిధిలావస్థకు చేరుకున్న రహదారుల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందన్నారు.