రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో శుక్రవారం ఎమ్మెల్యే ఈశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు గ్రామ సభల ద్వారా క్షేత్రస్థాయి సమస్యలు, పనులు గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నేరుగా పేద ప్రజలకు అందేలా పరిపాలన అందించాలని ఆయన స్పష్టం చేశారు.