ఉరవకొండ: తాగునీటికి నిధులు కేటాయించాలి
తాగునీటికి నిధులు కేటాయించాలని సీపీఎం నాయకులు మధుసూదన్ రంగారెడ్డి అన్నారు. సోమవారం ఉరవకొండలోని సీపీఎం కార్యాలయంలో మాట్లాడుతూ.. మొదటి ఆయకట్టు నుండి చివరి ఆయకట్టు వరకు ప్రతి ఒక్క ఎకరాకు నీరు అందే విధంగా హంద్రీనీవా పిల్ల కాలువలను పూర్తి చేయాలన్నారు. 6వేల క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చే విధంగా మూడు జిల్లాలకు సాగునీరు, త్రాగునీరు అందించే విధంగా చూడాలన్నారు.