విద్యా హక్కు చట్టం ప్రకారం 25శాతం ఉచిత విద్యను గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులకు కార్పోరేట్ విద్యను అందించిందని జీవీఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాకే పురుషోత్తం తెలిపారు. ఉరవకొండలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పుడు ఆ జీవో రద్దు అయిందని, అయితే ఫీజులు చెల్లించాలని ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు.