విడపనకల్లు మండలంలోని డినేకల్ గ్రామంలో ఆదినారాయణ వ్యక్తి నుంచి కర్ణాటక మద్యం 192 టెట్రా పాకెట్స్ స్వాధీనం చేసుకునట్లు ఇన్స్పెక్టర్ రవిచంద్ర సోమవారం విలేఖరులకు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఉరవకొండ కోర్టులో ప్రవేశపెట్టి జ్యూడిషియల్ రిమాండ్ కు పంపామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.