నార్పల మండలంలో పలు పాఠశాలలను బుధవారం మండల విద్యాధికారులు కృష్ణయ్య, నారపరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల పనితీరు, ఉపాధ్యాయులు, యాజమాన్యాల పనితీరు అక్కడ చదువులు పిల్లల మౌలిక సౌకర్యాలు వంటి విషయాలను పరిశీలించారు. ముఖ్యంగా విద్యార్థుల మార్పుల జాబితా వాటి వివరాలు విద్యార్థుల పుట్టిన తేదీ సర్టిఫికెట్లను వారి రికార్డులుపై (అపార్) ఆయా పాఠశాల యాజమాన్యాలతో చర్చించారు.