కనగానపల్లి మండలంలో ముగ్గురు వైసీపీ నేతలపై మంగళవారం పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బద్దలాపురంలో దామోదర్ రెడ్డి, దినేశ్ రెడ్డి, శంకర్ రెడ్డి. లక్ష్మీనరసమ్మ, నరసింహులు అనే దళిత దంపతుల మధ్య పొలం విషయమై గొడవ జరిగింది. తమను కులం పేరుతో తిట్టారని వారు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ఇషాక్ బాషా తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.