అనారోగ్యంతో బాధపడుతూ పేద కుటుంబాలు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్న సమయంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం అన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శస్త్రచికిత్సలు చేయించుకున్న 10 మందికి రూ. 6.78 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని ఆమె తెలిపారు.