హిందూపురం డిఎస్పీ మహేష్ మానవత్వం చాటుకున్నారు. సోమవారం కొత్తచెరువు - గోరంట్ల మార్గంలోని గంట్ల మారెమ్మ గుడి దగ్గర చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో అనంతపురంకి చెందిన దేవేంద్ర, అతని రెండున్నరేళ్ల కొడుకు శరత్ గాయపడ్డారు. అదే సమయంలో విధి నిర్వహణలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయానికి బయలుదేరి అటుగా వచ్చిన హిందూపురం డిఎస్పీ మహేష్ వెంటనే తన వాహనాన్ని ఆపి గాయపడ్డ తండ్రీ కొడుకును సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.