కంబదూరు మండలం నూతిమడుగు సమీపంలో పెన్నా నదిపై నిర్మించిన బ్రిడ్జి వర్షాలకు గత శుక్రవారం కూలిపోయింది. దీంతో గత రెండు రోజులుగా నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం కూడా నీళ్లు వృథాగా పోతున్నాయి. కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టడం లేదని రైతులు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నీళ్లు వృథా కాకుండా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతు కోరుతున్నారు.