కదిరి పట్టణం ఇక్బాల్ రోడ్డుకు చెందిన ఇమ్రాన్ తన నుంచి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి దాడిచేసి గాయపరిచారని పట్టణ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల మేరకు. నిజాంవలి కాలనీకి చెందిన మౌలాలి నాలుగేళ్ల కిందట రూ. 35 వేలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి ఇవ్వమనడంతో మొహం చాటేస్తున్నాడు. విసుగు చెందిన ఇమ్రాన్ నిలదీయడంతో మౌలాలి, మహబూబ్ మరో నలుగురు కలిసి అతడిపై దాడికి పాల్పడ్డారు.