హిందూపురం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా తహసీల్దార్ కి ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని, ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ చార్జీలు 3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.