అనంతపురం జిల్లాలోని క్రైస్తవ ప్రార్థనాలయాలలో ప్రాముఖ్యత వహించింది గుత్తి టౌన్ చర్చి. గుత్తి పట్టణ నడిఒడ్డులో గుత్తి కోటకు అతి సమీపంలో విశాలమైన మైదానంలో నిర్మితమైన ఈ చర్చి చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకొంది. నవంబర్ 15, 16 తేదీల్లో శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా చర్చి డ్రోన్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.