గుంతకల్లు పట్టణంలోని 12వ వార్డులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో టీడీపీ సభ్యత్వ నమోదును పెద్ద సంఖ్యలో చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. లక్ష సభ్యత్వాలకు తగ్గకుండా సభ్యత్వం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.