ధర్మవరంలో ఎస్ఐ శ్రీనివాసులు మంగళవారం రాత్రి పోలీస్ సిబ్బందితో కలిసి పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఏటీఎంల వద్ద పరిశీలించి అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాల్లో సైతం గస్తీ నిర్వహించారు. రాత్రి మొత్తం పట్టణంలో బీట్ నిర్వహిస్తూ ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.