ధర్మవరం పట్టణంలో బుధవారం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. ధర్మవరం కండ కన్వీనర్ పులిచర్ల శ్రీనివాసులు నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సమరసత వేదిక అధ్యక్షులు కేతా గోపాల్, కార్యదర్శి వాసుదేవయ్య మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు సమాజానికి ఎంతో విలువైనవని, వారి సేవలను గుర్తు చేయడం కోసమే సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో కార్మికులకు సన్మానం చేసినట్లు తెలిపారు.