అంగన్వాడీ కేంద్రాల్లో అయోడైజ్డ్ ఉప్పునే వాడాలని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ తస్లీమ్ సూచించారు. ప్రపంచ అయోడిన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం నగరంలోని ఇందిరానగర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంల్లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, స్థానికులకు అవగాహన కల్పించారు. సాధారణ ఉప్పు వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.