అనంతపురం నగరంలోని డిఏం&హెచ్ఓ కార్యాలయం వద్ద, బాధితులతో కలిసి డిఎం&హెచ్ ఓ కు ప్రైవేటు ఆసుపత్రులలో జరుగుతున్న మరణాలను ఆపాలని వైద్యం రాని డాక్టర్లతో ప్రజల ప్రాణాలు తీసిన కార్పొరేట్ హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. అలాగే వైద్యం తెలియని ప్రైవేటు వైద్యులు నిర్లక్ష్యంతో పేద ప్రజల ప్రాణాలు పోగొడుతున్నారని శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు.