శింగనమల వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం సాయంత్రం పరామర్శించారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న ఆమె అనంతపురం లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వ్యక్తిగతంగా తన వంతు సహాయంగా రూ. లక్ష అందజేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.