అనంతపురం నూతన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబుని ఏపీ ఉపాధ్యాయ సంఘం ఆపాస్ నాయకులు గురువారం సాయంత్రం కలిసి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలను తెలియచేశారు. ఆపాస్ నాయకులు రాజేంద్రప్రసాద్, కళ్యాణి, ఎర్రిస్వామి మాట్లాడుతూ జిల్లాలోని డీఈఓ, ఎంఈఓ కార్యాలయాలలో చాలామంది ఉపాధ్యా యులు కార్యాలయం పనులు చేసుకుంటున్నారని, ఉపాధ్యా యులకు కార్యాలయాల్లో పనులు చెప్పకుండా కేవలం బోధనకే పరిమితం చేయాలన్నారు.