రైతులు, మహిళలను, యువతను సీఎం చంద్రబాబు దగా చేశారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సోమవారం విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అనంతపురంలో స్పందించిన ఆయన ఇది కోతల బడ్జెట్ అని అభివర్ణించారు. బడ్జెట్ లో అంకెల గారడీ తప్పితే ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు.