ఆధార్ కార్డ్ నమోదు కోసం పాఠశాలల్లో ఆధార్ కేంద్రాలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ బుధవారం అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ని కలసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆధార్ లో పేర్లు తప్పుగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని విజయ్ భాస్కర్ తెలిపారు.