ఉదయగిరి పట్టణంలోని శ్రీ శక్తి భవనంలో ఏపీఎం ఖాజా రహమతుల్లా సమక్షంలో ఉదయగిరి మండల సమైక్య ఆధ్వర్యంలో.. ఆఫీస్ బేరర్స్ నూతన కమిటీకి బుధవారం సమావేశం జరిగింది. ఏపీఎం మాట్లాడుతూ.. ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి మండల సమైక్య ఆఫీస్ బేరర్స్ కమిటీని ఎన్నుకోవడం సర్వసాధారణమన్నారు. ఇందులో భాగంగా అధ్యక్ష, కార్యదర్శు, కోశాధికారులు ఎంపికకు ఎన్నిక జరుగుతుందని తెలిపారు.