ఉదయగిరి మండలంలోని 36 పోలింగ్ కేంద్రాల్లో శనివారం ప్రత్యేక ఎన్నికలపై ప్రచార కార్యక్రమాలు జరిగాయి. ఆయా కేంద్రాల వద్ద బూత్ లెవెల్ అధికారులు పాల్గొని ఓటర్ల నుంచి ఫారం 6, 7, 8 అందుబాటులో ఉంచుకొని కొత్తవారి నుంచి ఓటు హక్కు చేర్చుకోవడం మార్పులు, చేర్పులు, తొలగింపులు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. బిఎల్వోలు మాట్లాడుతూ మృతి చెందిన ఓటర్ల వివరాలు సంబంధిత ఆధారాలతో ఫారం పూర్తి చేయాలన్నారు.