నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల పరిధిలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనంది. నూతనంగా నిర్మిస్తున్న సీతారాంపురం- కావలి జాతియ రహదారిపై విద్యుత్ స్తంభాలు ఏర్పాటులో భాగంగా ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులందరూ గమనించి సహకరించాలని కోరారు. మధ్యాహ్నం నుంచి యధావిధిగా విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని తెలిపారు.