పొదలకూరు మండలం ఆల్తూరి సమీపంలోని తిప్పవాగును మంగళవారం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించారు. గతంలోనూ వర్షాలకు ఈ వాగు పొంగి చుట్టుపక్కల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ వాగును అధికారుల పరిశీలించారు. వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ముందస్తు జాగ్రత్తగా వాగు రెండువైపులా రాకపోకలు జరగకుండా ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితి పరిశీలిస్తూ ఉండాలని స్థానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.