నెల్లూరు ఎంపీ వేమిరెడ్డికి మరో పదవి
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మరో అరుదైన ఘనతను సాధించారు. ఇప్పటికే పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ, ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన ఆయన మరో కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఛైర్మన్‌గా ఏర్పాటైన కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు.