కోవూరు: విద్యార్థుల అస్వస్థతపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం

60பார்த்தது
కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సోమవారం రాత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో పలువురు విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌ అయి అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం అందుకున్న ఆమె రాత్రి 10 గంటల సమయంలో స్వయంగా పాఠశాలకు వెళ్లారు. పాఠశాలలో పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు.

தொடர்புடைய செய்தி