ప్రజలకు ఉచిత విద్యుత్తును అందించేందుకే ప్రధానమంత్రి సూర్య ఘర్ ముప్త్ బిజిలి యోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి చెప్పారు. కావలి పట్టణంలోని తుమ్మలపెంట రోడ్ లోని స్పందన ఫంక్షన్ హల్ నందు ఈ పథకం ద్వారా విద్యుత్ వినియోగదారులు పొందే ప్రయోజనాలను వివరించే అవగాహన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు.