రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో సోమవారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాలేపాటి సోదరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యకర్తలకు బలం, కార్యకర్తల సభ్యత్వంతో కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.