దర్శి పట్టణానికి చెందిన కానిస్టేబుల్ భాగ్యరాజు హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా అతని చికిత్స నిమిత్తం అతని సతీమణి ఝాన్సీ కి అత్యవసరంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ రూ. లక్ష చెక్కును అందజేశారు. సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ చెక్కును ఝాన్సీ కి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు.