ఒంగోలు నగరంలోని మల్లయ్య లింగం భవన్ లో రెండు రోజుల పాటు ఏపీ హేతువాద సంఘ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లుగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు నార్నే వెంకటసుబ్బయ్య తెలిపారు. ఒంగోలులో తన ప్రైవేట్ అతిధి గృహంలో మంగళవారం మీడియాతో వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ నవంబర్ 9, 10వ తేదీల్లో జరుగుతున్న ఏపీ హేతువాద సంఘ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని తెలిపారు. దేశంలోనే ఉన్నతమైన శాస్త్రీయ దృక్పథం కలిగిన నాయకులు పాల్గొంటారని తెలిపారు.