మోసగించిన వ్యక్తికి 14 రోజులు రిమాండ్
నకిలీ పట్టా సృష్టించి మహిళను మోసగించిన ఘటనలో ఓ వ్యక్తికి మార్కాపురం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. బాపూజీ కాలనీకి చెందిన గురవయ్య, ఎస్సీ బీసీ కాలనీకి చెందిన ఓ మహిళకు రూ. 25 లక్షలు తీసుకొని లేని భూమికి నకిలీ పట్టా సృష్టించి అంటగట్టాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షాదారలతో కోర్టులో ప్రవేశపెట్టారు. మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధిస్తూ సోమవారం తీర్పుఇచ్చారు.