మార్కాపురం: కోట్లలో అప్పు.. ఆపై పరారు
మార్కాపురం మండలం బోడిచర్ల గ్రామంలో వెంకట సత్య వరప్రసాద్ స్థానికంగా కోట్లల్లో అప్పులు చేసి పరారైనట్లుగా ఎస్సై అంకమ్మరావు ఆదివారం తెలిపారు. నిందితుడు గ్రామంలో ఓ చిరు దుకాణాన్ని నిర్వహిస్తూ పలువురితో స్నేహం పెంచుకొని రూ. 2. 30 కోట్లు అప్పు తీసుకున్నాడని రుణ దాతల నుంచి ఒత్తిడి పెరగడంతో కుటుంబంతో సహా పరారైనట్లుగా తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై తెలిపారు.