రాష్ట్ర నైపుణ్యాభివృధ్ధి సంస్ధ ఆధ్వర్యంలో 2020 - 21, 2021- 22 విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యను పూర్తి చేసిన విద్యార్ధులకు ఐటి రంగంలో స్ధిరపడే విధంగా ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్ధానిక మార్కాపురం పట్టణంలోని శ్రీ జార్జీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చెసిన ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యామండలి పర్యవేక్షక అధికారి సైమన్ విక్టరు మాట్లాడుతూ.. వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు వలసలు వెళుతున్న పరిస్ధితుల గురించి అవగాహన ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్, హెచ్ సి ఎల్ కంపెనీ వారితో సంప్రదించి మన ప్రాంతంలో జాబ్ మెళాను ఏర్పాటు చెయడం జరిగిందన్నారు. ఉద్యోగాలను వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వెళుతున్న మన పిల్లల కోసం కంపెనీ వారే మన దగ్గరకు వచ్చి ప్లేస్ మెంట్ ద్వారా ఉద్యోగాలను కల్పించటం అన్నది గొప్ప అవకాశమని అందరూ వినియోగించుకోవాలని మంత్రి కృతఙ్ఞలను తెలిపారు. ఈ సందర్భంగా ఎచ్ఈఎల్ ఎచ్ఆర్ నాగరాజు మాట్లాడుతూ.. నమోదు ప్రక్రియ, సెలక్షన్ ప్రాసెస్, కెరీర్ అవకాశాలు గురించి వివరించారు. సుమారుగా 200 మంది మేళాకు హాజరైయ్యారు. ఈ కార్యక్రమానికి ఎచ్సీఎల్ సభ్యులు, కో ఆర్డినేటర్ మోహనకృష్ణ, ప్రిన్సిపాల్ రాజబాబు, కళాశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.