కనిగిరి పట్టణంలోని లాడ్జిలను వెలిగండ్ల ఎస్సై మధుసూదన్ రావు బుధవారం తనిఖీ నిర్వహించారు. లాడ్జిలోని రికార్డులను నిషితంగా పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. లాడ్జిలకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు అడ్రస్ ప్రూఫ్ చూసిన తర్వాత మాత్రమే గదిని అద్దెకి ఇవ్వాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.