కనిగిరిలోని పలు రెస్టారెంట్లను మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాయక్ రసూల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రెస్టారెంట్లలో వంటగదులలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. రెస్టారెంట్లలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న విధానాన్ని పరిశీలించారు. రెస్టారెంట్ నిర్వాహకులతో మాట్లాడుతూ మటన్, చికెన్, ఫిష్ వంటి నాన్ వెజ్ పదార్థాలను నిల్వ ఉంచరాదని అలా ఉంచినట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.