గిద్దలూరు: సర్పంచ్ పై ఫిర్యాదు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట తాండ సర్పంచ్ లోక నాయక్ పై గ్రామస్తులు, వార్డు మెంబర్లు శనివారం పంచాయతీరాజ్ శాఖ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధులను తన సొంత అవసరాలకు వాడుకున్నారని లేఖలో వారు పేర్కొన్నారు. రూ. 19 లక్షల వరకు అవినీతి జరిగినట్లుగా ఆరోపించారు. సర్పంచ్ అవినీతిపై విచారణ జరిపి అధికారులు చర్యలు తీసుకోవాలని వార్డు మెంబర్లు, కార్యకర్తలు అధికారులను కోరారు.