గిద్దలూరూలో ఓటర్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని శనివారం స్థానిక తహశీల్దార్ ఆంజనేయ రెడ్డి ప్రారంభించారు. బి. ఎల్. వోలు ఆధ్వర్యంలో పలు స్టాలు ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. ఈ ఓటర్ స్పెషల్ డ్రైవ్ లో మార్పులు, చేర్పులతో పాటు కొత్తగా ఓటు హక్కును కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆంజనేయ రెడ్డి చెప్పారు. నవంబర్ 9, 10, 23, 24 తేదీలలో ఈ డ్రైవ్ జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.