ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలని నగర పంచాయతీ కమిషనర్ వెంకట దాసు ఆక్రమణదారులకు శనివారం విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చామని, ఈనెల 12వ తేదీలోపు గడువు ముగుస్తుందని అన్నారు. స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకొని వారివి ఈనెల 13వ తేదీన తొలగిస్తామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రజల సహకరించి, ఆక్రమణలు తొలగించాలన్నారు.