ప్రకాశం జిల్లా, కొమరోలు మండలంలో నవంబర్ 9, 10వ తేదీలలో ఓటర్ల సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ భాగ్యలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల ఓట్లు వేరు వేరు పోలింగ్ బూత్ లలో ఉంటే వారందరివి ఒకే బూత్ కు మార్చడం జరుగుతుందని భాగ్యలక్ష్మి అన్నారు. ఓటర్లు తమ ఓటర్ల లిస్టును పరిశీలించి సమస్యలు ఉంటే తహశీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలన్నారు.